మై నేమ్ ఈజ్ ఖాన్.. ఐయామ్ నాట్ ఏ టెర్రరిస్ట్: పాలో ట్వీట్ వైరల్

by Prasanna |   ( Updated:2023-02-04 11:10:16.0  )
మై నేమ్ ఈజ్ ఖాన్.. ఐయామ్ నాట్ ఏ టెర్రరిస్ట్: పాలో ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: బ్రెజిలియన్ రచయిత, నటుడు పాలో కొయెల్‌హో.. బాలీవుడ్ యాక్టర్ షారుఖ్‌ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఇటీవల 'పఠాన్'ను ఉద్దేశిస్తూ ట్విట్టిర్ వేదికగా స్పందించిన పాలో.. 'కింగ్. లెజెండ్. ఫ్రెండ్. అన్నింటికంటే గొప్ప నటుడు (పాశ్చాత్య దేశాలలో అతని గురించి తెలియని వారికోసం.. 'మై నేమ్ ఈజ్ ఖాన్- అండ్ ఐయామ్ నాట్ ఏ టెర్రరిస్ట్') అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. కాగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తనదైన స్టైల్‌లో రిప్లయ్ ఇచ్చిన షారుఖ్.. 'నువ్వు ఎల్లప్పుడూ దయతో ఉంటావు మిత్రమా. వీలైనంత త్వరగా కలుద్దాం. మమ్మల్ని ఆశీర్వదించండి' అంటూ పాలోకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా వీరిద్దరి డిస్కషన్ చూసి ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్.. 'మీరు అందరి ప్రశంసలకు అర్హులు. ఇద్దరు లెజెండ్స్. మీ ప్రేమతో మరింత వెలుగును పంచుతూ ఉండండి' అంటూ పొగిడేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 'గబ్బర్ సింగ్‌' కు రెమ్యూనరేషన్ అనుకున్నంత ఇవ్వలేదు: Pawan Kalyan

Advertisement

Next Story