- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిహారికతో ఎడబాటు..? ఆ బాధను తట్టుకోలేక మెడిటేషన్ సెంటర్లో చేరిన మెగా అల్లుడు.. పోస్ట్ వైరల్
దిశ, వెబ్ డెస్క్: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట బుల్లితెర యాంకర్‌గా పరిచయం అయి ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది. 2020లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్‌లో ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను డిలీట్ చేశారు. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారంటూ పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై ఇద్దరూ స్పందించ లేదు. అయితే నిహారిక విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా చెప్పనప్పటికీ భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జరగ్గా.. ఆ వేడుకకు నిహారిక వచ్చింది కానీ, ఆమె భర్త ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆ ఫొటోలు చూసిన వారు వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారని అనుకుంటున్నారు.
అయితే సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినా కానీ మెగా అల్లుడు చైతన్య మాత్రం స్పందించలేదు. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా లేడు. తాజాగా, నిహారిక భర్త చైతన్య చాలా రోజుల తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘ ఈ స్థలం.. నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. గత 10 రోజులుగా నా జీవితంలోకి వచ్చిన విపాసన ప్రక్రియ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. మనం ఓ చోటుకి ఎలాంటి అంచనాల్లేకుండా వెళ్లి, అద్భుతమైన జ్ఞానంతో తిరిగొస్తుంటాం. ఇది అలాంటిదే’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు ఇంకా ఎక్కువ పవర్ రావాలని కోరుకుంటున్నారు. మరి కొంత మంది మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేసి ఆయనను బాధపెట్టకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. విపాసన పగోడా అనేది ఓ మెడిటేషన్ సెంటర్ అని సమాచారం.