- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరుగురు అగ్ర హీరోలతో సెన్సేషనల్ మూవీ.. రామ్ చరణ్‌దే కీలక పాత్ర?
దిశ, వెబ్‌డెస్క్: లోక నాయకుడు కమల్ హాసన్, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'విక్రమ్'. పాన్ ఇండియా లెవెల్‌లో విడుదలైన ఈ తమిళ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కమల్ హాసన్ రేంజ్ ఏంటో ఇండస్ట్రీకి చూపించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఈయితే, ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని దర్శకుడు లోకేష్ కనగరాజ్ కొన్ని సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. గతంలో కార్తీ హీరోగా నటించిన ఖైదీతో పాటు ప్రస్తుతం తలపతి విజయ్‌తో తీయబోయే తదుపరి చిత్రం కూడా 'విక్రమ్' సినిమాతో లింక్ ఉన్నట్లు డైరెక్టర్ లోకేష్ హింట్ ఇచ్చాడు. ఈ క్రమంలో మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
'విక్రమ్-2'లో టాలీవుడ్‌లో స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు నెట్టింట్లో వార్తలు విస్తృతమయ్యాయి. ఇప్పటికే స్టోరీని డైరెక్టర్ చరణ్ వినిపించగా.. చరణ్ సైతం వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 'విక్రమ్'లో కమల్ హాసన్ మనువడిగా నటించిన బాలుడి పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఒకే సినిమాలో కమల్ హాసన్, రామ్ చరణ్, తలపతి విజయ్, రోలెక్స్ పాత్రలో సూర్య, ఢిల్లీ పాత్రలో కార్తీ, ఇప్పటికే అందులో భాగమైన ఫహద్ ఫాసిల్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో తమిళ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనిస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి : మొన్న ప్రభాస్ - నిన్న అనుష్క.. ఆ విషయంలో ఇద్దరిది సేమ్ రియాక్షన్!