- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీనియర్ నటుడు శరత్ బాబు అసలు పేరు ఏంటో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: సీనియర్ నడుడు శరత్ బాబు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో కలిపి ఇప్పటివరకు దాదాపు 250కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. వరుసగా మూడు సార్లు నంది అవార్డు అందుకొని రికార్డు సృష్టించారు. సితార, అన్వేషణ, దాగుడుమూతలు, స్వాతిముత్యం, ఆపద్బాంధవుడు, ముత్తు వంటి ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. అయితే అభిమానులకు శరత్ బాబుగా పరిచయమైన ఈ సీనియర్ నటుడి అసలు పేరు చాలా మందికి తెలియదు. ఆయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్.
శ్రీకాకులం జిల్లాలోని ఆముదాలవలసకు చెందిన విజయశంకర దీక్షితులు, సుశీలాదేవిల సంతానమే శరత్ బాబు. ఓ పెద్ద పోలీసు ఆఫీసర్ కావాలనుకున్న శరత్ బాబు.. అనుకోకుండా నాటక రంగానికి, అక్కడి నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1973లో విడుదలైన రామరాజ్యం మూవీతో శరత్ బాబు హీరోగా అరంగేట్రం చేశారు. ఇక అక్కడి నుంచి హీరో, విలన్, సపోర్టింగ్ యాక్టర్ వంటి పలు పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. శరత్ బాబు చివరిసారిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీలో నటించారు. కాగా ఆయన నటుడు వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ నటించిన ‘మళ్లీ పెళ్లి’లో ఓ మెయిన్ రోల్ చేసినట్లు సమాచారం. కాగా శరత్ బాబు మే 22న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Read More: శరత్ బాబు మొదటి భార్య టాప్ టాలీవుడ్ నటి అని మీకు తెలుసా?