- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాటిని చూస్తే నా రక్తం మరిగిపోతుంది.. హీరోయిన్ రితికా సింగ్ ఆసక్తికర పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ రితికా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. వెంకటేష్ గురు మూవీతో ఈ అమ్మడు మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవల మళ్లీ చాలా రోజుల తర్వాత దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కొతాలో కనిపించింది.
తాజాగా, ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘‘ ప్రతి రెండు గంటలకు ఏదో ఓ మూల మహిళలు, అమ్మాయిలు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. వార్తల్లో ఇలాంటి ఘటనలు చూసిన ప్రతిసారి నా రక్తం మరిగిపోతోంది. ఈ దారుణాలు ఇంకెప్పుడు ఆగుతాయి. మహిళలపై అఘాయిత్యాలు ఆగాలంటే మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో జరుగుతన్న దారుణాలు చూస్తుంటే ప్రతి బిడ్డకు సెల్ఫ్ డిఫెన్స్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి దారుణాలు తట్టుకుని ఈ సమాజంలో నిలబడాలి అంటే మన పిల్లలతో జరుగుతున్న ఘటనలపై చర్చించాలి. ఇలాంటి చిన్న పిల్లలతో చర్చించడం కష్టమైనప్పటికీ వారి భవిష్యత్తు కోసం మనం మారాలి. మన భవిష్యత్ తరాల పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మహిళలంతా ఇలాంటి దారుణాలపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి’’ అంటూ రాసుకొచ్చింది.