భయపెడుతున్న ‘భూల్ భూలైయా-3’ టీజర్..

by sudharani |
భయపెడుతున్న ‘భూల్ భూలైయా-3’ టీజర్..
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హారర్ మూవీస్‌లో ‘భూల్ భూలైయా’ ఒకటి. అక్షయ్ కుమార్, విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2007లో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమా పార్ట్ 2 తెరకెక్కించారు మేకర్స్. అది 2022లో రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక పార్ట్ 2 కూడా అంచనాలను మించి బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టడంతో.. ఇప్పుడు పార్ట్-3 తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు చిత్ర బృందం. ‘భూల్ భూలైయా-3’లో కార్తిక్ ఆర్యన్, విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. దీనికి అనీశ్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్‌లో చూస్తే.. ఈసారి భయపెట్టడంతో పాటు కామెడీ పంచేవిధంగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ‘భూల్ భూలైయా-3’ టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story