సందీప్‌ కిషన్‌ మీరు పీపుల్స్‌స్టార్‌ అయితే ఆర్‌ నారాయణ మూర్తి ఏమిటి?

by Disha cinema |
సందీప్‌ కిషన్‌ మీరు పీపుల్స్‌స్టార్‌ అయితే ఆర్‌ నారాయణ మూర్తి ఏమిటి?
X

దిశ, సినిమాః తెలుగు సినిమా హీరోలకు అభిమానులు ప్రేమతో వాళ్ల పేరు ముందు మెగాస్టార్‌, సూపర్‌స్టార్‌ గ్లోబల్‌స్టార్‌, మాస్‌ మహారాజా, ఐకాన్‌స్టార్‌, యంగ్‌టైగర్‌ ఇలా జోడిస్తుంటారు. సదరు హీరో క్రేజ్‌, అభిమానుల ఫాలోయింగ్‌ను బట్టి పేర్లకు ముందు ఈ ట్యాగ్‌లు రెడీ అవుతాయి. అయితే రీసెంట్‌గా యువ హీరో సందీప్‌ కిషన్‌ తన పేరుకు ముందు పీపుల్స్‌ స్టార్‌ అని తనే తగిలించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రం మజాకా పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక నుంచి సందీప్‌ కిషన్‌ పేరుకు ముందు పీపుల్స్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ కంటిన్యూ అవుతుందని దాని సారాంశం. అయితే అభ్యుదయ భావాలతో, సామాజిక స్పృహతో, సందేశాత్మక చిత్రాలు రూపొందించే నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్‌.నారాయణ మూర్తిని అందరూ పీపుల్స్‌స్టార్‌ అని పిలుచుకుంటారు. లాల్‌సలాం, దండోరా, ఎర్రసైన్యం, చీమల దండు, రైతురాజ్యం, వేగుచుక్కలు, ఎర్రోడు, ఒరేయ్‌ రిక్షా ఇలా దాదాపు 38 చిత్రాలు సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా...సినిమాకు పెట్టిన పెట్టుబడి వస్తుందో లేదో కూడా తెలియకుండా ప్రజాచైతన్యం కోసం మాత్రమే సినిమాలు నిర్మించే ఆర్‌.నారాయణ మూర్తి సినీ రంగంలో అసలు సిసలైన కళాకారుడు. అయితే ఇప్పటి వరకు సాధారణంగా నారాయణ మూర్తిని పీపుల్స్‌స్టార్‌గా పిలుచుకుంటాం.

అయితే ఇప్పుడు ఆ పీపుల్స్‌స్టార్‌ ట్యాగ్‌ను యువ కథానాయకుడు సందీష్‌ కిషన్‌ తన పేరుకు ముందు యాడ్ చేసుకున్నాడు. దాదాపు 30 సినిమాల్లో నటించిన సందీప్ కిషన్‌ కెరీర్‌లో వెంకట్రాది ఎక్స్‌ప్రెస్‌ మినహా పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేమి లేవు. ఇప్పటి వరకు హీరోగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌ చేసుకోలేకపోయాడు ఈ యువ హీరో. ఇప్పడు ఈ హీరో ఏకంగా ఆర్‌.నారాయణ మూర్తిని సినీ రంగంతో పాటు ఆయన అభిమానులు ఎంతో ఇష్టంగా పిలుచుకునే పీపుల్స్‌ స్టార్‌ ట్యాగ్‌ను తన పేరుకు ముందు తగిలించుకున్నాడు. ఇది చూసిన ఆర్‌.నారాయణ మూర్తి సన్నిహితులు, అభిమానులు సందీప్‌ కిషన్‌ మీరు పీపుల్స్‌ స్టార్‌ అయితే మరి ఆర్‌.నారాయణ మూర్తి ఏమని పిలవాలి? అయినా సినిమాను వ్యాపారంగా భావిస్తూ అన్ని తరహా చిత్రాలు చేసే మీకు ఈ పీపుల్స్‌స్టార్ పదం సరిపోదు.. వెంటనే మార్చుకోండి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు..!

Advertisement

Next Story

Most Viewed