- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Samyukta Menon: ఆ పేరు మా అమ్మకు నచ్చలేదు.. అందుకే మార్చుకున్నా

దిశ, సినిమా: బ్యూటీఫుల్ యాక్ట్రెస్ సంయుక్త మీనన్ తన పేరును కేవలం సంయుక్తగా మార్చుకోవడంపై ఓపెన్ అయింది. ఆమె నటించిన 'సార్' మూవీ ఫిబ్రవరి 17న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో తన లైఫ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నా పేరు వెనక మీనన్ తీసెయ్యాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. అయితే స్కూల్లో చేరినప్పుడు ఇంటిపేరుతో సహా సంయుక్త మీనన్ అని నమోదు చేశారు. చిన్నతనంలో దాని గురించి పెద్దగా తెలియదు. మా నాన్న ఎప్పుడో అమ్మకు విడాకులిచ్చేశాడు. ఆయన పేరును నేను కంటిన్యూ చేయడం అమ్మకు నచ్చలేదు. ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలనుకున్నా. అయినా పేర్ల వెనకాల ఇలాంటి తోకలు ఎందుకు ఉండాలి? అనే ప్రశ్న మొదలైంది. దీంతో ఇంటిపేరును కొనసాగించకూడదని ఫిక్స్ అయ్యా. అందుకే ఇకపై సంయుక్తగానే ఉంటా' అని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి: