- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naga Chaitanya-Sobhita ఎంగేజ్మెంట్పై స్పందించిన సమంత.. వైరల్ అవుతున్న ఆసక్తికర పోస్ట్
దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీరిద్దరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. మనస్పర్థలు రావడంతో పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటున్నారు. సమంత మయోసైటీస్ కారణంగా సినిమాలకు దూరం అయితే.. నాగచైతన్య మాత్రం తండేల్ మూవీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ప్రజెంట్ షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం తొందరలోనే విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. నాగచైతన్య యంగ్ బ్యూటీ శోభితతో నిశ్చితార్థం చేసుకున్నాడు.
ఈ విషయాన్ని ఆయన తండ్రి అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదికగా ఆగస్టు 8న ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. గత కొద్ది కాలంగా డేటింగ్లో ఉన్న వీరు సడెన్‌గా ఒక్కటి కాబోతున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేయడంతో వీరి ఫొటోలతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఎక్కడ చూసినా వీరిద్దరి ఎంగేజ్మెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో.. శోభిత దూళిపాళ ఫ్యామిలీకి సంబంధించిన వివరాలన్నీ బయటకు వస్తున్నాయి. అయితే ఈ అమ్మడు చెల్లి పేరు కూడా సమంతనే కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఆమె డాక్టర్‌గా పనిచేస్తోందని సమాచారం. ఆమెకు ఆల్రెడీ పెళ్లి కావడంతో మరోసారి.. నెట్టింట సమంత ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా, సమంత తన అక్క శోభిత ఎంగేజ్మెంట్ గురించి ఆమె స్పందించి ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టడంతో అంతా దాని గురించే చర్చించుకుంటున్నారు. చైతు-శోభిత నిశ్చితార్థంలో తీసుకున్న ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తూ.. 2022 నుంచి లవ్‌లో ఉన్నారు ఎప్పటికీ అని చెప్పేసింది. ప్రజెంట్ సమంత పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. వీరిద్దరు సీక్రెట్‌గా 2 ఏళ్లు ప్రేమాయణం నడిపారా అని అంటున్నారు. అంతేకాకుండా నీ పేరు సమంత నీకు కాబోయే బావ మాజీ భార్య పేరు కూడా సమంత రుత్ ప్రభు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. 2021 అక్టోబర్‌లో చైతు విడాకులు తీసుకున్నాడు కేవలం రెండు నెలల్లోనే ప్రేమను ఎలా పొందగలిగాడు అని రాసుకొచ్చాడు. ప్రజెంట్ సమంత పోస్ట్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
(Video Link Credits to Samanta Dhulipala Instagram Channel)