Salman Khan: సల్మాన్‌పై నెగెటివ్ ట్రోల్స్.. అలా చేయడం తప్పంటున్న నెటిజన్స్

by GSrikanth |   ( Updated:2023-03-20 18:46:03.0  )
Salman Khan
X

దిశ, సినిమా : Salman Khan trolled for upsetting behavior towards fan at airport| బాలీవుడ్‌లో మిగతా హీరోలతో పోలిస్తే సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ క్రేజ్ వేరు. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా తను నటించిన ప్రతి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అంతేకాదు సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుండే సల్లూ భాయ్.. ఈ విషయంలో నెటిజన్ల ఆదరాభిమానాలు పొందడం తెలిసిందే. ఈ సంగతి పక్కనబెడితే సల్మాన్ తాజాగా చేసిన ఓ పని వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు.

త్వరలో దుబాయ్‌లో జరగనున్న IFFA అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు అబుదాబికి వెళ్తున్న క్రమంలో.. ముంబైయ్ ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు సల్మాన్. ఈ క్రమంలో తనను చూసిన కొందరు ఫ్యాన్స్ ఆనందంతో గంతులేయగా.. అందులో ఓ అభిమాని సల్మాన్, తన తల్లితో కలిసున్న ఫొటోను బహుమతిగా ఇస్తూ కెమెరా వైపు ఫేస్ చేశాడు. కానీ సల్మాన్ మాత్రం అతనితో ఫొటో దిగడం ఇష్టం లేదన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం పట్ల నెటిజన్లు నెగెటివ్‌గా కామెంట్ చేస్తున్నారు. 'ఆ యాటిట్యూట్ చూడండి.. ఎంత ఘోరంగా ఉందో', 'అభిమానుల వల్లే మీరు పెద్ద స్టార్ అయ్యారు. వారిని తక్కువగా చూడడం కరెక్ట్ కాదు' అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

Advertisement

Next Story