ఓల్డ్ సిటీ కబాబ్స్‌పై కన్నేసిన ముంబై బ్యూటీ.. అదే స్పెషల్ అంటూ

by Anjali |   ( Updated:2023-04-18 13:33:33.0  )
ఓల్డ్ సిటీ కబాబ్స్‌పై కన్నేసిన ముంబై బ్యూటీ.. అదే స్పెషల్ అంటూ
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ తనకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉందంటోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని సరసన ఓ మూవీ చేస్తున్న ముంబై గర్ల్.. ‘నేను చిన్నప్పటి నుంచి ఈ నగరాన్ని సందర్శిస్తున్నాను. ఒకసారి స్కూల్ ట్రిప్‌కి కూడా వచ్చాను. కానీ, ‘దబాంగ్ 3’ని ప్రమోట్ చేయడానికి వచ్చినప్పటి అనుభవం నా జీవితాన్ని మార్చేసింది.

ఇక్కడి ప్రేక్షకుల నుంచి నాకు లభించిన ప్రేమ నిజంగా చాలా గొప్పది. అప్పటి నుంచి ఇక్కడి చిత్రనిర్మాతలు ప్రాజెక్ట్‌ల కోసం నన్ను సంప్రదిస్తే నో చెప్పలేకపోతున్నా. ఇక్కడ టమాటా పప్పు, అన్నంతో పాటు గోంగూర, ఊరగాయ, రంజాన్ సమయంలో ఇచ్చే ఆహారం చాలా ఇష్టం. ముఖ్యంగా ఓల్డ్ సిటీ కబాబ్‌ అండ్ మాల్పువా ఎప్పటికీ మిస్ అవను’ అంటూ అన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Also Read.. :బొల్లారంలో సందడి చేసిన నటి కీర్తి సురేష్



Next Story