ఒంపు సొంపులు సరిగ్గా లేవని ఆడిషన్స్ నుంచి వెళ్లగొట్టారు.. Richa Chadha

by samatah |   ( Updated:6 July 2023 6:24 AM  )
ఒంపు సొంపులు సరిగ్గా లేవని ఆడిషన్స్ నుంచి వెళ్లగొట్టారు.. Richa Chadha
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ నటి రిచా చద్దా కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న అనుభవాలపై ఓపెన్ అయింది. 2008లో వచ్చిన ‘ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్!’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆమె.. కొన్ని ప్రాజెక్టుల కోసం ఆడిషన్స్‌లో పాల్గొన్నప్పుడు బాడీ షేమింగ్‌కు గురైనట్లు తెలిపింది. ‘మొదట్లో చాలామంది అందంగా లేనని చెప్పారు. ఒంపు సొంపులు కూడా సరిగా లేవన్నారు. ఓ నిర్మాత సైజులు పెంచుకుని కనిపించమన్నాడు. దీంతో చాలా ఒత్తిడికి గురయ్యాను. అయితే అలాంటి వ్యాఖ్యలు సర్వసాధారణమని కొద్ది రోజులకు తెలిసింది. నాలాగే ఫస్ట్ టైమ్ ఆడిషన్‌కు వెళ్లిన ఏ అమ్మాయిని అడిగినా వారికి అదే అనుభవం ఎదురైందని చెప్పారు’ అంటూ చెప్పుకొచ్చింది. చివరగా ఓ అసహ్యకరమైన ఆబ్జెక్టిఫికేషన్ పాత్రను తిరస్కరించినందుకు నిర్మాత దాడి చేసిన విషయాన్ని కూడా ఆమె గుర్తుచేసుకుంది.

Read More: Rakul Preet Singh : దగ్గుబాటి రానాకి భార్య అవ్వాల్సింది.. కానీ !

అతన్ని చూడగానే నాలో కామం పుట్టింది : Vidya Balan



Next Story

Most Viewed