Richa Chadda : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రిచా

by Sujitha Rachapalli |   ( Updated:18 July 2024 12:32 PM  )
Richa Chadda : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రిచా
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 16న బేబీ గర్ల్ కు ఈ లోకంలోకి వెల్ కమ్ చెప్పినట్లు ప్రకటించింది. కాగా నటుడు అలీ ఫజల్, రిచా... 2020 లాక్ డౌన్ టైంలో పెళ్లి చేసుకున్నారు. హల్దీ, సంగీత్ గ్రాండ్ గా చేసుకున్న జంట.. చట్టబద్ధంగా ఒక్కటయ్యారు. అంతకు ముందే కొన్నాళ్లపాటు డేటింగ్ కూడా చేసిన ఇద్దరు.. ప్రస్తుతం బాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో ఒకరుగా ఉన్నారు.

ఇక ఇదిలా అంటే ఈ మధ్య బేబీ బంప్ తో చేసుకున్న ఫోటోషూట్ తో కాస్త నెగెటివిటి ఎదుర్కొన్నారు. ప్రైవేట్ ఫొటోస్ అని పోస్ట్ చేస్తూ కామెంట్ సెక్షన్ మ్యూట్ చేసినా విమర్శలు మాత్రం తప్పలేదు. ఇవి బెడ్ రూమ్ లో ఇంటిమసీ సీన్స్ మాదిరిగా ఉన్నాయని ట్రోల్ చేసారు జనాలు. అయినా సరే వీటన్నింటినీ లైట్ తీసుకున్నారు రిచా - అలీ దంపతులు.

Next Story