- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రికార్డు టికెట్ సేల్స్.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఈ ఘనత ‘లియో’ దే!
దిశ, సినిమా: తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘లియో’. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ కానుంది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుకాగా.. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యూఎస్ లో భారీ రికార్డ్ క్రియేట్ చేసినట్టు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. ఇప్పటికే మిలియన్ డాలర్ల మార్క్ దాటగా.. గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కూడా రిలీజ్ కు ముందే మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంది.
దీంతో అమెరికా బాక్సాఫీస్ దగ్గర ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్ సినిమాగా ‘లియో’ నిలిచింది. ఇక ఇటు అమెరికాలోనే కాదు.. అటు యూకేలోనూ ఇప్పటికే రిలీజ్ కు ముందు అత్యధిక టికెట్లు అమ్ముడుపోయాయి. దీన్ని బట్టి చూస్తే తొలి రోజే ఈ మూవీ రూ.110 కోట్లు వసూలు చేస్తుందన్న అంచనా ఉంది. అంతేకాదు ఇండియాలో ఓపెనింగ్స్ రూ.60 కోట్లుగా, మిగతా ప్రపంచ దేశాల్లో రూ.50 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఆ లెక్కన చూసుకుంటే 2.0 రికార్డును బ్రేక్ చేసి అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన తమిళ సినిమాగా ‘లియో’ నిలిచే అవకాశం ఉంది.