RC16: రామ్ చరణ్ సినిమాలో మరో స్టార్ హీరో..? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్..!

by Kavitha |   ( Updated:2024-12-11 04:59:49.0  )
RC16: రామ్ చరణ్ సినిమాలో మరో స్టార్ హీరో..? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్..!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’(Game Changer). సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shanker) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక చిత్రం సంక్రాంతి సందర్భంగా గ్రాండ్‌గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం షూటింగ్ కంప్లీట్ కావడంతో మరో సినిమాకు రెడీ అయ్యాడు. బుచ్చిబాబు(Buchi Babu) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే 'ఆర్సీ 16'(RC16) అనే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి AR రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఆర్సీ 16 సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు సమాచారం. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్‌లో సల్మాన్ ఖాన్(Salman Khan) నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో సల్మాన్ ఖాన్.. చిరంజీవి(Chiranjeevi) నటించిన గాడ్ ఫాదర్(Godfather) సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. అందులో నటించినందుకు ఆయన ఒక్క పైసా కూడా తీసుకోకపోవడంతో విశేషం. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్.. రామ్ చరణ్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తారని మెగా అభిమానులు నమ్ముతున్నారు. దీనికి సంబంధించిన సమాచారం సంక్రాంతికి వచ్చే చాన్స్ ఉన్నట్లు మూవీ మేకర్స్ చెబుతున్నారు. కాగా ఈ కాంబో సెట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story