మీరు చూసిన దానికంటే చూడనిది చాలా ఉందంటూ బిగ్‌బాస్ బ్యూటీ పోస్ట్..

by Hamsa |   ( Updated:2023-10-03 07:33:08.0  )
మీరు చూసిన దానికంటే చూడనిది చాలా ఉందంటూ బిగ్‌బాస్ బ్యూటీ పోస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్-7 రియాలిటీ షో స్టార్ట్ అయి నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. అయితే నాలుగో వారం ఊహించని విధంగా రతిక ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత బిగ్‌బాస్ బగ్‌లోకి వెళ్లి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. అందులో తన గురించి నెటిజన్లు ఏమనుకుంటున్నారో తనకు అర్థమయ్యేలా గీతూ చూపించింది. దీంతో కొంత మంది అందరినీ వాడుకుందని ట్రోల్స్ కూడా చేశారు.

తాజాగా, రతిక అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆమె టీమ్ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘‘ రతికను బిగ్‌బాస్ సీజన్-7 జర్నీ మొత్తంలో ప్రేమించిన, సపోర్ట్ చేసిన అందరికీ చాలా థాంక్యూ. ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ పరిస్థితులు సహకరించకపోయినా మాతో నిలబడిన ఫ్యాన్స్‌కు స్పెషల్‌గా థ్యాంక్స్. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము. అంతేకాకుండా హేటర్స్‌కు, రివ్యూవర్స్‌కు కామెంట్స్ చేసేవాళ్లకు, యూట్యూబ్ ఛానెళ్లకు కూడా థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి ఒక దృక్పథం ఉంటుందని మాకు అర్థమవుతుంది. మేము దానిని గౌరవిస్తాం కూడా. మీ సమయాన్ని కేటాయించి రతిక కు ఓటు వేసినందుకు, పోస్టులకు కామెంట్ చేసినందుకు అభినందిస్తున్నాం. అంతేకాకుండా టీమ్ రతిక అనేది ఎప్పటికీ అంతరించిపోరు. కానీ ఈ అకౌంట్ మాత్రం పూర్తిగా రతిక చేతిలోకి వెళ్తుంది’’ అని రాసుకొచ్చారు. ఒకటే రిక్వెస్ట్.. ఎవరికైతే సంబంధం ఉందో వారందరికీ ఒకటే రిక్వెస్ట్. మరీ మరీ దిగజారిపోయి అసభ్యకరంగా కామెంట్ చేసే స్థాయికి వెళ్లకండి. పర్సనల్ అవ్వకండి. ఇది ఎవరి ప్రపంచానికి ముగింపు కాదు అని అన్నారు. అలాగే రతిక ఫొటోతో ‘ఒక పుస్తకాన్ని.. దాని కవర్ చూసి జడ్జ్ చేయవద్దు. మీరు చూసిన దానికంటే చూడనిది చాలా ఉంది’’ అంటూ కొటేషన్ కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Read More: తన ఒంటిపై ఉన్న టాటూల గురించి ఓపెన్‌గా చెప్పేసిన అనసూయ

Advertisement

Next Story