- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్మిక ఫేక్ వీడియోపై ఒక్కొక్కరుగా స్పందిస్తున్న సినీ తారలు
దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మికకు సంబంధించిన డీప్ నెక్ ఫేక్ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోపై సినీ నటులు, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే.. కల్వకుంట్ల కవిత, అమితాబచ్చన్, నాగచైతన్య పలువురు రియాక్ట్ కాగా.. తాజాగా సాయి ధరమ్ తేజ్, మృణాల్ ఠాకూర్‌లు కూడా స్పందించారు.
ఫేక్ వీడియోసై స్పందించిన సాయి ధరమ్ తేజ్ ‘ఎంతో బాధగా, సిగ్గుగా అనిపిస్తుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వల్ల ఒక వ్యక్తి ఎంత నరకాన్ని అనుభవిస్తున్నాడో అర్థం చేసుకోవడం చాలా బాధేస్తోంది. ఈ తప్పుదారి పట్టించే సాంకేతికత సాధారణ అమ్మాయిల జీవితాల్లో ఎలాంటి మానసిక విధ్వంసం కలిగిస్తుందనే ఆలోచనే చాలా భయానకమైనది. ఇలాంటి వాటిపై వెంటనే అవగాహన కల్పించి, ఇలాంటి వాటిపై కఠినమైన చట్టాలు తీసుకురావడం ఎంతో అవసరం’ అంటూ ట్వీట్ చేశారు.
మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ ‘ఈ విషయాన్ని తలుచుకుంటే చాలా సిగ్గేస్తోంది. అలాంటి పనులు చేసే వారిలో కొంచెం కూడా మంచితనం లేదనిపిస్తోంది. ఇలాంటి విషయాల మీద నోరు విప్పి మాట్లాడినందుకు, సమస్యను అందరి ముందుకు తీసుకొచ్చిన రష్మికకు థాంక్స్. ఇలాంటి వాటి మీద మాట్లాడకుండా చాలా మంది సైలెంట్‌గా ఉండిపోతారు. హీరోయిన్ల ఫోటోలు ఎక్కువగా మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తుంటారు. అమ్మాయి శరీరాన్ని ఇష్టమొచ్చినట్టుగా మార్ప్ చేస్తుంటారు. ఈ సమాజం ఎటు పోతోంది.. సెలెబ్రిటీలమైన పాపానికి మీరు ఇలా చేస్తారా? అందరూ ఈ విషయం మీద ఎందుకు మాట్లాడరు.. ఇదే అసలైన సమయం. వెంటనే అందరూ నోరు విప్పండి.. దీనిపై ప్రశ్నించండి’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్టోరీ పోస్ట్ చేసింది.