- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో టచ్‌లోనే ఉన్నా.. వదులుకోలేనంటున్న రష్మిక
దిశ, సినిమా : నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రీసెంట్‌గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న నటిని.. ఏదైనా పార్టీకి ప్రస్తుత బాయ్ ఫ్రెండ్‌తో హాజరైనపుడు అక్కడ అనుకోకుండా మాజీ లవర్ ఎదురుపడితే ఎలా స్పందిస్తారు? అని అడిగారు. దీనికి ఏ మాత్రం తడబడకుండా ఆన్సర్ చేసిన రష్మిక.. '2016లో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం రద్దయిన తర్వాత కూడా మేము స్నేహితులుగా కొనసాగుతున్నాం. ఇరువురి కుటుంబాలతోనూ మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుత భవిష్యత్ ఎలా ఉన్నా.. గతంలో కొనసాగిన రిలేషన్స్ తెంచుకోవాలని అనుకోను. అయితే ఇలా అనుబంధం పెంచుకోవడం మంచి లక్షణమా? కాదా? ఖచ్చితంగా తెలియదు. కానీ అందరితో కలిసుంటేనే బాగుంటుందని భావిస్తా. భవిష్యత్‌లోనూ ఎంతమంది మాజీలైనా స్నేహం మాత్రం కొనసాగిస్తా' అంటూ వివరించింది. అలాగే ప్రపంచమంతా రష్మిక- విజయ్ డేటింగ్ చేస్తున్నారంటూ నెత్తినోరు మొత్తుకున్నప్పటికీ తాను పెద్దగా పట్టించుకోలేదన్న నటి.. ఎప్పుడూ నిబద్ధత కొల్పోలేదని, ఇకపైనా ఇలాగే ఉంటానని చెప్పింది.
ఇవి కూడా చదవండి : ధనుష్- ఐశ్వర్య.. మళ్లీ కలవనున్నారా?