- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాజమౌళికే అలాంటి షరతులు పెట్టిన Ramya krishna !

దిశ, సినిమా: రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’ ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రమ్యకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘నరసింహ’ మూవీలో అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ హీరోయిన్ లేదా సెకండ్ హీరోయిన్ అని చూడలేదు. రజనీ సినిమాలో భాగమైతే చాలనుకున్నా. నా లైఫ్‌లో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఇదే. సెకండ్ ఇన్నింగ్‌లో ‘బాహుబలి’తో మంచి హిట్ దక్కింది. నిజంగా ఈ స్థాయి సక్సెస్ సాధిస్తుందని అనుకోలేదు. కానీ ‘బాహుబలి’ సినిమాలో కొన్ని షరతులు పెట్టాను. రాత్రిపూట షూటింగ్ చేయనని, కొద్దిరోజులు మాత్రమే షూటింగ్‌కు వస్తానని చెప్పాను. దీనికి రాజమౌళి అంగీకరించారు. రజనీ, చిరులు స్క్రీన్‌పై కనిపిస్తే పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు. చాలా గ్యాప్ తర్వాత రజనీతో కనిపిస్తున్న రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి’ అంటూ చెప్పుకొచ్చింది.