- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPASANA: స్వాతంత్య్ర దినోత్సవంపై మెగా కోడలు ఉపాసన ఫైర్.. సంచలన పోస్ట్ వైరల్
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె కేవలం మెగా ఫ్యామిలీ కోడలిగానే కాకుండా అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తుంది. ఎన్నో సేవాకార్యక్రమాల్లో పాల్గొని అందరి ప్రశంసలు అందుకుంటోన్న ఉపాసన గొప్పతనం గురించి స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కరోనా సమయంలో అనేక మందికి సహాయం చేసి గొప్ప మనసు చాటుకుంది. మారుమూల గ్రామాలకు సైతం వైద్య సేవలు అందించింది. దేశవ్యాప్తంగానున్న పలు రాష్ట్రాల్లోని వృద్ధాశ్రమాలకు కూడా అండగా నిలిచింది. వారికి టాబ్లెట్స్, ఫుడ్, ఇతర సౌకర్యాలు కల్పించింది. ఇలా ఇప్పటికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ వంటి 150 రాష్ట్రాల్లోని వృద్ధాశ్రమాలకు సహాయం చేస్తూనే ఉంది. అయితే నేడు దేశవ్యాప్తంగా ప్రజలందరూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన సోషల్ మీడియా వేదికన ఓ ఆవేదన చెందుతూ ఓ పోస్ట్ పెట్టింది. మనం ఎలాంటి స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్నామని నిలదీసింది. కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై జరిగిన హత్యాచారంపై మెగా కోడలు మాట్లాడింది. మానవత్వాన్ని అపహాస్యం చేసే దారుణమైన ఘటన ఇదని ఫైర్ అయింది. ప్రస్తుతం కూడా సొసైటీలో అనాగరికత కొనసాగుతుంటే మనం ఎలాంటి స్వాతంత్య్యాన్ని జరుపుకుంటున్నామని గొంతెత్తి ప్రశ్నించింది. దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే వెన్నెముక అని మహిళల్ని కొనియాడింది. ఎక్కువ మంది మహిళల్ని వర్క్‌ఫోర్స్‌లోకి తీసుకురావాలన్నదే తన డ్రీమ్ అని చెప్పుకొచ్చింది. స్త్రీలందరికీ మర్యాద, ఒక సెక్యూరిటీ అందించేందుకు అందరూ కృషి చేయాలని ఉపాసన సోషల్ మీడియా వేదికన మహిళల గురించి మాట్లాడుతూ కాస్త ఫైర్ అయింది.