- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెళ్లయ్యాక మొదటిసారి భర్తతో కలిసి స్టెప్పులేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఇన్‌స్టా రీల్ వైరల్
దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ అమ్మడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ మహారాజా రవితేజ వంటి స్టార్ హీరోల సరసన అద్భుతంగా నటించి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ బ్యూటీకి ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
దీంతో రకుల్ బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా పెద్దగా మూవీ అవకాశాలు దక్కలేదు. సినిమాల విషయం పక్కన పెడితే.. రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ తో కొంతకాలం ప్రేమలో ఉండి.. ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. గోవాలో ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఫిబ్రవరి 21 వ తేదీన మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి వీడియోలు, ఫొటోలు రకుల్ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కు షేర్ చేస్తూ సందడి చేస్తుంది.
తాజాగా రకుల్-జాకీ భగ్నానీ కలిసి ఓ రీల్ చేశారు. అయితే ఈ డాన్స్ రీల్ ఓ ఛాలెంట్ లో భాగంగా చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న ‘బడే మియా ఛోటే మియా’ సినిమా నుంచి రీసెంగ్ గా ‘మస్త్ మలంగ్ ఝుమ్’ అనే సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌ను ఇన్‌స్టా రీల్ తో టైగర్ ష్రాఫ్ రీ క్రియేట్ చేసి.. బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, రకుల్, జాకీ భగ్నానీ అండ్ తన అభిమానులకు ఛాలెంజ్ ఇచ్చారు.
ఈ సాంగ్ లోని స్టెప్పులను రీ క్రియేట్ చేస్తూ రీల్ చేయాలంటూ అనడంతో.. ఇక టైగర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసి, రకుల్ అండ్ జాకీ కలిసి ఆ డాన్స్ వీడియో పంచుకున్నారు. పెళ్లయ్యాక తొలిసారి కొత్త జంట కలిసి స్టెప్పులేయడంతో నెట్టింట జనాలు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More..
నయనతారతో విడాకులు.. క్లారిటీ ఇస్తూ ఎమోషనల్ వీడియో షేర్ చేసిన విఘ్నేష్