- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మతోన్మాదుల్లారా.. నోరు మూయండి: షారుఖ్‌కు మద్దతుగా రాహుల్
దిశ, సినిమా: షారుఖ్ ఖాన్‌పై దాడిచేస్తున్న ట్రోలర్స్‌పై బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్ ధోలాకియా విరుచుకుపడ్డాడు. మూర్ఖత్వపు సిద్ధాంతాల మతోన్మాదులే షారుఖ్‌తో పాటు అతని సినిమా 'పఠాన్'ను టార్గెట్ చేసి ఆన్‌లైన్‌లో ద్వేషపూరిత దాడి చేస్తున్నారంటూ మండిపడ్డాడు. ఇలాంటి క్లిష్ట సమయంలోనే నటుడికి ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరూ మద్దుతు ఇవ్వాలని సినీ సోదరులను కోరుతున్నానని తెలిపాడు. ఈ మేరకు తాజాగా ట్వీట్ చేసిన రాహుల్.. '@iamsrkపై కొనసాగుతున్న ద్వేషపూరిత దాడిని సినీ పరిశ్రమలోని అందరూ ఖండించాలి. ఎస్‌ఆర్‌కే భారతదేశ వినోద పరిశ్రమకు అంబాసిడర్‌గా, సోదరభావానికి ప్రతీకగా ఎంతో సహకారం అందించాడు. కాబట్టి మూర్ఖపు సిద్ధాంతాలున్న ఈ మతోన్మాదులకు దయచేసి నోరుమూయాలని చెప్పండి!' అంటూ రాసుకొచ్చాడు.
ఇదిలావుంటే సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ ఉలేమా బోర్డు ప్రెసిడెంట్ సయ్యద్ అనాస్ అలీ.. పఠాన్ అత్యంత గౌరవప్రదమైన ముస్లిం వర్గాల్లో ఒకరు. ఈ సినిమాతో పఠాన్‌లనే కాదు మొత్తం ముస్లిం సమాజం పరువు తీస్తున్నారు. మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించి పఠాన్‌లను తప్పుగా చిత్రీకరించారు. ముస్లిం మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి మేము అనుమతించట్లేదు' అని స్పష్టం చేశాడు.