- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Pushpa -2: థియేటర్లలో పుష్పరాజ్ రప్పా రప్పా.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్రేజీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) దేశవ్యాప్తంగా కాదు.. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఏ ముహూర్తాన టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడో కానీ.. ఆల్మోస్ట్ ఈ హీరో నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగానే నిలుస్తున్నాయి. సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అత్యంత తక్కువ సమయంలో ఐకాన్‌స్టార్ అని ముద్ర వేసుకున్నాడు. ఇక బన్నీ అదిరిపోయే డ్యాన్స్ గురించైతే స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇకపోతే అల్లు అర్జున్.. సుకుమార్ (Sukumar)దర్శకత్వంలో రెండు పార్ట్స్‌గా తెరకెక్కిన పుష్ప సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ఈ చిత్రం నిన్న(డిసెంబరు 05) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై.. ప్రేక్షకుల వద్ద నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. విడుదలకు ముందే బుక్ మై షో లో అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి.. రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే థియేటర్లలో నిన్న విడుదలైన పుష్ప 2 (Pushpa 2) తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 175 కోట్ల వసూళ్లు రాబట్టిందట. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా ఎక్కువ ఉన్నట్లు టాక్ సినీ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోన్న టాక్. ఇకపోతే అమెరికా(America)లో ఫస్ట్ డే 4.2 మిలియన్ల డాలర్లు ( అంటే.. రూ.35 కోట్లు పైన) వసూలు చేసిందని నిర్మాణ సంస్థ వెల్లడించింది.
Read More...
పుష్పా-2 షోలో కలకలం.. పెప్పర్ స్ప్రేతో హల్ చల్ చేసిన యువకుడు