సినిమానే మొదలు కాలే... అప్పుడే రిలీజ్​ డేట్​ చెప్పిన పూరీ

by Sridhar Babu |   ( Updated:2023-07-01 15:45:03.0  )
సినిమానే మొదలు కాలే... అప్పుడే రిలీజ్​ డేట్​ చెప్పిన పూరీ
X

దిశ, వెబ్​డెస్క్​ : పూరీ జగన్నాథ్ అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన సినిమాల్లో స్టోరీలైనప్​ కూడా ఆసక్తిగా ఉంటుంది. అయితే ఆయన తీసిన సినిమాలు కొన్ని అట్టర్​ ప్లాప్​ అయ్యాయి. సూపర్​డూపర్​ హిట్​ అయినవి కూడా ఉన్నాయి. అలా ఇటీవల బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన సినిమా లైగర్. ఈ ఆ మూవీ విజయ్ కి కూడా కెరియర్ పరంగా కొంత ఎఫెక్ట్ అయింది. అనంతరం కొంత గ్యాప్​ తీసుకున్న పూరీ మళ్లీ తన సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ సిద్ధం చేశాడు. రామ్ పోతినేని తో పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో రామ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లింది. మంచి మాస్​ ఇమేజ్​ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ పేరు తో మూవీ ని ఎనౌన్స్ చేశారు. పాన్ ఇండియా లెవల్ లో చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే అని కన్ఫర్మ్ చేశారు.

రామ్ హీరో గానే పవర్ ఫుల్ మాస్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రాన్ని ఆవిష్కరించడానికి పూరి జగన్నాథ్ సిద్ధం అయ్యారు. అయితే అసలు విషయం ఏమిటంటే ఇంకా మూవీ ప్రారంభం కూడా కాకుండానే వచ్చే ఏడాది మార్చి 8న రిలీజ్ చేస్తామని పోస్టర్ రిలీజ్ చేసేశారు. దాంతో ఈ విషయం చిత్రసీమలో హాట్​ టాపిక్​గా మారింది. ఇదేం చోద్యం సినిమా మొదలు కాకుండానే రిలీజ్​ డేట్​ ప్రకటించడం ఏమిటని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాని ఏకంగా రూ. 40 కోట్ల బడ్జెట్ తో చార్మి నిర్మాతగానే ప్లాన్ చేస్తున్నారంట. మరో విషయం ఏమిటంటే లైగర్ సినిమాకి ఆస్తులు అన్నీ తాకట్టు పెట్టి మరీ నిర్మించినట్లు ప్రచారం జరిగింది. మొత్తం తమ దగ్గర ఉన్నదంతా లైగర్ కి ఖర్చు చేశామని చార్మి చెప్పారు. మరి ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కోసం ఏకంగా 40 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తామని చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎంత వరకు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.

Also Read..

‘పవన్ కల్యాణ్ కామాంధుడు, చాలా నీచమైన వ్యక్తి..’ కలకలం సృష్టిస్తోన్న నటి వాయిస్ రికార్డ్ ట్వీట్

Advertisement

Next Story