Producer Niranjan Reddy: డబుల్‌ ఇస్మార్ట్‌ హక్కులను ఫ్యాన్సీ రేట్‌తో దక్కించుకున్న నిర్మాత!

by sudharani |   ( Updated:2024-07-22 15:03:10.0  )
Producer Niranjan Reddy: డబుల్‌ ఇస్మార్ట్‌ హక్కులను ఫ్యాన్సీ రేట్‌తో దక్కించుకున్న నిర్మాత!
X

దిశ. సినిమా: ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని, మాస్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం 'డబుల్‌ ఇస్మార్ట్‌'. ఇంతకు ముందు ఈ ఇద్దరు కలిసి చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ మూవీని.. ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులను హనుమాన్‌ చిత్ర నిర్మాత నిరంజన్‌ రెడ్డి ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నాడు.

పూర్తి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీని నిర్మాత నిరంజన్‌ రెడ్డి తెలుగుతో పాటు హిందీ, మిగతా భాషల రైట్స్‌ను కూడా భారీ ధరకు సొంతం చేసుకున్నాడని సమాచారం. హనుమాన్‌ మూవీతో పాన్‌ ఇండియా హిట్‌ కొట్టిన ఈయన.. ఇటీవలే డార్లింగ్‌ మూవీతో ఓ పరాజయాన్ని పలకరించాడు. అయితే ఇంత పెద్ద ఆఫర్‌తో ఈ చిత్రాన్ని దక్కించుకోవడం ఎంత వరకు సేఫ్‌ అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కావ్య థాపర్‌ నాయికగా నటిస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రాన్ని కథానాయిక ఛార్మికౌర్‌తో కలిసి పూరి జగన్నాథ్‌ నిర్మించారు.

Read more...

Operation Raavan: మారువేషం.. మాస్క్.. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఆపరేషన్ రావణ్’

Advertisement

Next Story