పొలిటికల్ ఎంట్రీపై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Javid Pasha |   ( Updated:2023-07-29 12:16:48.0  )
పొలిటికల్ ఎంట్రీపై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: తన పొలిటికల్ ఎంట్రీపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇక తనకు పార్టీలతో నిమిత్తం లేదని, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఎంపీగా గెలుస్తానని స్పష్టం చేశారు. ఇక రాజకీయ నాయకుడిగా సినీ రంగం తర్వాతే మిగతావాటికి ప్రాధాన్యమిస్తానని చెప్పారు.

ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడైతే తనకు కిరీటం పెట్టరన్న ఆయన.. ఆ పదవితో అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. సీనియర్లు ఎవరూ ముందుకు రాకపోవడం వల్లే తాను ఆ ఫిలిం ఛాంబర్ ఎన్నికల బరిలో ఉన్నట్లు చెప్పారు. నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ బైలాస్ ను సవరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే వీటన్నింటికీ సరైన వ్యక్తి ఉంటేనే న్యాయం జరుగుతుందని తెలిపారు. కాగా ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు, సి.కల్యాణ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Advertisement

Next Story