నీకు ఎందుకంత ఇగో.. ప్రవర్తన మార్చుకో: సోదరి పెళ్లికి వెళ్లని ప్రియాంకపై ట్రోలింగ్

by Prasanna |   ( Updated:2023-09-25 07:17:26.0  )
priyanka Chopra
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన కజిన్ పరిణీతి చోప్రా పెళ్లి కారణంగా దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. ఆప్ ఎంపి రాఘవ్ చద్దాతో పరిణీతి వివాహం ఆదివారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యారేజ్ ఈవెంట్‌కు ప్రియాంక అటెండ్ కాలేదు. అంతేకాదు ఇదే రోజున తన కూతురితో విహార యాత్రలు చేస్తూ తెగ ఎంజాయ్ చేసిన ఫొటో, వీడియోలను నెట్టింట పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ఫ్యాన్స్ సోదరి పెళ్లికి ప్రియాంక రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ‘అగర్ రియల్ సిస్టర్ కి షాదీ హోతీ’ అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘నీకు ఎందుకంత ఇగో. కట్టుబాట్లను వదిలేసి ఆమె పెళ్లి వేడుకలకు ఇప్పుటికైనా వెళ్లు. నీ ప్రవర్తన మార్చుకో’ అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై పీసీ ఎలా రియాక్ట్ అవుతుండో చూడాలి.

Read More..

ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటైన పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా.. వైరల్ పిక్స్


Advertisement

Next Story