oscars 2023-Naatu Naatu: ‘నాటు నాటు’కు ఆస్కార్‌తో భారత్ గర్వపడుతోంది: ప్రధాని మోడీ

by GSrikanth |   ( Updated:2023-03-13 05:26:24.0  )
oscars 2023-Naatu Naatu: ‘నాటు నాటు’కు ఆస్కార్‌తో భారత్ గర్వపడుతోంది: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు రావడంతో దేశం గర్వపడుతోందని అన్నారు. పాటను రాసిన చంద్రబోస్‌కు, సంగీతం అందించిన కీరవాణికి, పాడిన రాహుల్ సిప్లిగంజ్‌, కాలభైరవతో దర్శకుడు రాజమౌళి, నటులు రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో పాటు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నాటు నాటు పాట ప్రపంచమంతా పేరు తెచ్చుకన్నదని తెలిపారు. ఈ పాటను ఏళ్ల తరబడి స్మరించుకుంటారని అభిప్రాయపడ్డారు.

Read more:

తెలుగువారు గర్వపడేలా చేశారు.. ఆర్ఆర్ఆర్ టీమ్ పై కేసీఆర్ ప్రశంసలు

Advertisement

Next Story