ప్రభాస్ బయట కూడా రాముడే.. కృతి సనన్‌ వైరల్ కామెంట్స్‌

by Anjali |   ( Updated:2023-05-10 09:34:50.0  )
ప్రభాస్ బయట కూడా రాముడే.. కృతి సనన్‌ వైరల్ కామెంట్స్‌
X

దిశ, సినిమా: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘ఆదిపురుష్‌’. ఓం రౌత్‌ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీత పాత్రలో నటించగా, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్‌ అందుకుంటోంది. ఇండియాతోపాటు యూఎస్ఏ, యూకే, కెనడా సహా 70 దేశాల్లో అత్యధిక స్క్రీన్స్‌లో ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన గ్రాండ్‌ ఈవెంట్‌లో హీరోయిన్‌ కృతిసనన్‌ ప్రభాస్‌‌పై ప్రశంసలు కురిపించింది. ‘రాముడిలాగే ప్రభాస్ చాలా మంచివాడు. చాలా సింపుల్‌‌గా ఉంటాడు’ అంటూ ఆకాశానికెత్తేసింది.

Also Read...

భారతీయుడిగా ఓటు వేశా: నటుడు కిచ్చా సుదీప్

Advertisement

Next Story