NBK 108’లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ !

by Anjali |   ( Updated:2023-05-10 07:20:34.0  )
NBK 108’లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ !
X

దిశ, సినిమా: ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా తన కెరీర్‌లో 108వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ఎంటర్టైనర్‌లో బాలయ్య డ్యూయల్ షేడ్స్‌లో కనిపించనుండగా, ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మస్తు రెస్పాన్స్ వచ్చింది. అయితే మేకర్స్ ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్‌ అయితే అందించారు. ‘NBK 108’లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. దీని గురించి అధికారికంగా ప్రకటిస్తూ దర్శకుడు అనిల్ ఓ వీడియే షేర్ చేశాడు. ఇందులో బాలకృష్ణ పవర్‌ఫుల్ డైలాగ్‌ను నటుడు అర్జున్ రాంపాల్ చెబుతూ.. తనకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్‌కు, బాలయ్యకు థ్యాంక్స్ చెప్పాడు.

Read More: ఇండియన్ గోల్డెన్ ఐకాన్ స్టార్‌గా అవార్డు అందుకున్న బన్ని


Advertisement

Next Story