‘BRO’ సినిమాలో తన పాత్రపై Pawan Kalyan కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-26 04:06:05.0  )
‘BRO’ సినిమాలో తన పాత్రపై Pawan Kalyan కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా సముద్ర ఖని డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. ఈ సినిమా ఈనెల 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో మంగళవారం గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా సినిమాలో తన పాత్రపై పవన్ కల్యా్ణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలో తనది గెస్ట్ క్యారెక్టర్ కాదన్నారు. సినిమాలో 80 శాతం తన క్యారెక్టర్ ఉంటుందన్నారు. ఒక ఫ్యాషన్ స్టేట్ మెంట్ తో ఈ సినిమా ఉందంటే దానికి కారణంగా కాస్ట్యూమ్ డిజైనర్ నీతూ లల్లూ అన్నారు. తెలుగు సినిమాపై మక్కువతో అమెరికాలో ఉన్న విశ్వప్రసాద్ ఈ సినిమాను చాలా గ్రాండ్ గా నిర్మించారన్నారు. ఇలాంటి సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించిన సముద్ర ఖనికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా తనకు బాగా నచ్చిందన్నారు. నవ్వుతూనే ఏడుస్తామన్నారు.

Also Read: ‘RRR’ లాంటి సినిమా తీయాలి.. ఆ ఇండస్ట్రీకి Pawan Kalyan కీలక సూచన..

Advertisement

Next Story