SSMB 29: ఒడిశాలో షూటింగ్.. ఉప ముఖ్య‌మంత్రి కీలక వ్యాఖ్యలు

by Vennela |   ( Updated:2025-03-12 15:02:27.0  )
SSMB 29: ఒడిశాలో షూటింగ్.. ఉప ముఖ్య‌మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: Rajamouli – Mahesh Project : ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ ప్రాజెక్టును దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ మూవీ వస్తుండటంతో పాటు మహేశ్, రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ మూవీలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఒడిశాలో శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాపై తాజాగా స్పందించారు ఒడిశా రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా. ఈ మూవీ షూటింగ్ ఒడిశాలో జరగడం రాష్ట్రానికి గర్వకారణమని..ఇది స్థానిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు రాష్ట్రాన్ని సినిమా షూటింగ్ లకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చుతుందని సూచించారు.


గతంలో మల్కాన్ గిరిలో పుష్ప 2 షూటింగ్ జరిగింది. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమా SSMB 29కోం కోరాపుట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఇది ఒడిశా పర్యాటక రంగానికి మంచి ఛాన్స్ వంటిది. ఈ సినిమా షూటింగ్ తో ఒడిశా ఫ్యూచర్ లో సినిమా షూటింగ్ లతో పాటు టూరిజంలకు ఒక గొప్ప గమ్యస్థానంగా మారుతుంది. మా దగ్గర షూటింగ్స్ చేసేందుకు అన్ని భాషల ఇండస్ట్రీలను స్వాగతిస్తున్నాం. షూటింగ్ లకు పూర్తి మద్దతు, ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇస్తామంటూ ఒడిశా డిప్యూటీ సీఎం ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

READ MORE ...

Gaddar Awards : ఏప్రిల్ లో గ్రాండ్ గా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం : టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు







Next Story

Most Viewed