- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మద్యం మత్తులో మళ్లీ దొరికిపోయిన కాజోల్ కూతురు.. అజయ్‌ని తిట్టిపోస్తున్న జనాలు

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్ అజయ్ దేవ్‌గన్ కూతురు నైసా దేవ్‌గన్ మరోసారి మద్యం మత్తులో అడ్డంగా బుక్కైంది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టక ముందే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చిన్నది.. ఇప్పటికే పలుసార్లు బోల్డ్ దుస్తులు ధరించి క్రూరంగా ట్రోలింగ్ ఎదుర్కొంది. అయినా తన ప్రవర్తనలో మార్పు కనిపించకపోగా తాజాగా తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓ పార్టీకి హాజరైన నైసా.. డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. గ్రీన్ టాప్, వైట్ ప్యాంట్ ధరించి కనిపించిన ఆమె.. పార్టీ ముగించుకుని కారు ఎక్కుతున్నపుడు తడబడింది. కారు ఫుట్ రెస్ట్‌ను సరిగా గుర్తించలేక పడబోయింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుండగా... ‘ఆమె ఎప్పుడూ తాగి ఉంటుంది. బహుశా ఇది కుటుంబ వారసత్వం కావొచ్చు. వారిని ఇండస్ట్రీ నుంచి జీవితకాలం బహిష్కరించాలి’ అంటూ అజయ్, కాజోల్‌ను కూడా తిడుతున్నారు నెటిజన్లు. ఇక నైసా ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని గ్లియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ చదువుతున్నట్లు సమాచారం.
- Tags
- Nysa Devgan