- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
సముద్రంలోని షార్క్ సీన్ గురించి ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 35 రోజులు వాటర్‌లోనే!
దిశ, వెబ్‌డెస్క్: శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర చిత్రం సెప్టెంబరు 27 న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ గురించి చెప్పుకొచ్చాడు. ఒక స్టూడియోలో అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం పెద్ద వాటర్ పూల్ రెడీ చేశామని తెలిపారు. ఇందుకోసం 200 వరకు మ్యాన్ మేడ్ వాటర్ ట్యాంక్స్ రెడీ చేసి.. 35 డేస్ ఆ వాటర్‌లోనే షూట్ చేశామని తారక్ వివరించాడు. ఈ మూవీలో అదే ముఖ్యమైన సీక్వెల్స్ అని వెల్లడించారు. నిజంగా సముద్రంలో జరిగిన ఫైట్‌లా జనాలకు చూపించడానికి చాలా మనీ ఖర్చు చేశామని అన్నారు. అంతేకాకుండా ఎంతగానో కష్టపడ్డామని, కాకపోతే షార్క్ సన్నివేశాలు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతాయని తెలిపారు.
కేవలం 15 నిమిషాల సన్నివేశం కోసం వన్ డే షూట్ చేశామని అన్నారు. వాటర్‌లో షూటింగ్ చేసినప్పుడు అప్పుడప్పుడు సరిగ్గా కనిపించకపోయేదని వ్యాఖ్యానించారు. అలాగే ముంబయికు ఫస్ట్ టైమ్ వెళ్లినప్పుడు అక్కడ టెక్నిషియన్స్, ఆర్టిస్ట్స్ ఎలా ఉంటారేమోనని చాలా భయపడిపోయానని తెలిపారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ అప్పుడు దర్శకుడు రాజమౌళి తారక్‌ను గైడ్ చేశాడని.. దీంతో ముంబయి అంటే కాస్త భయం పోయిందని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు.
Read More..
Devara Movie: దేవర టికెట్ల రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ఎంత పెరిగాయంటే?