- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్టీఆర్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి తెలుగు హీరోగా రికార్డ్ క్రియేట్ చేసిన యంగ్ టైగర్
దిశ, సినిమా: జూనియర్ ఎన్టీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ కమిటీలోని కొత్త మెంబర్స్ లిస్ట్‌లో తారక్ చోటు దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన అకాడమీ.. తారక్‌ను కొత్త అకాడమీ మెంబర్‌గా పరిచయం చేస్తూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట విజువల్స్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం అకాడమీ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. ‘ప్రౌడ్ మూమెంట్’ అంటూ నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇక ఈ ఏడాది ఆస్కార్ కమిటీ 398 మందికి కొత్తగా ఆస్కార్ ప్యానెల్‌లో చోటు కల్పించబోతున్నట్లు ఇటీవలే ప్రకటించగా భారత్ నుంచి పదకొండు మంది సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అందులో ఇండియా నుంచి ఎన్టీఆర్‌ను కమిటీ సభ్యుడిగా ఆస్కార్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆస్కార్ కమిటీ సభ్యుడిగా నియమితులైన తొలి తెలుగు హీరోగా ఎన్టీఆర్ ఖ్యాతి దక్కించుకున్నారు. కొత్తగా ఆస్కార్ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్న వారందరికీ రాబోయే ఆస్కార్ అవార్డుల ఎంపికలో ఓటు హక్కు ఉంటుంది.