Filmfare Awards South 24: అవార్డులపై ఇప్పుడు నాకు ఆసక్తి లేదు.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh N |
Filmfare Awards South 24: అవార్డులపై ఇప్పుడు నాకు ఆసక్తి లేదు.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2024 వేడకలు హైదరాబాద్‌లో శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. త‌మిళం, తెలుగు, మ‌లయాళం, క‌న్న‌డ ఇండ‌స్ట్రీల నుంచి ప‌లువురు సెలబ్రిటీలు ఈ వేడుక‌కు హాజ‌రై సంద‌డి చేశారు. అయితే తెలుగులో బ‌ల‌గంతో పాటు నాని న‌టించిన ద‌స‌రా, హాయ్ నాన్న సినిమాలు స‌త్తా చాటాయి. ఈ క్రమంలోనే ‘దసరా’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నాని అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కెరీర్ ఆరంభంలో తాను ఎన్నో అవార్డుల కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు నాని గుర్తుచేశారు. అప్పుడు త‌న‌కు కూడా అవార్డు అందుకోవాల‌ని బ‌లంగా అనిపించేదన్నారు. కానీ ఆ కోరిక క్రమంగా తగ్గుతూ వచ్చిందని, ఇప్పుడు అవార్డులపై ఆసక్తి కూడా లేదని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడున్న కోరిక ఏమిటి అంటే తన సినిమాలో న‌టించే న‌టులు, తన చిత్రంలో ప‌నిచేసే వాళ్లందరూ అవార్డులు తీసుకుంటుంటే కుర్చోని చూడాలని ఉందని చెప్పారు. అయితే, తను ఈ వేడుకలకు వచ్చింది అవార్డు గురించి కాదని, శ్రీకాంత్ ఓదెల(దసరా దర్శకుడు), హాయ్ నాన్న సినిమాకు శౌర్యువ్ ద‌ర్శ‌కులుగా అవార్డులు అందుకుంటుంటే చూద్దామ‌ని ఇక్క‌డ‌కు వ‌చ్చానని చెప్పారు. కానీ వాళ్ళిద్దరికి తను అవార్డును ఇవ్వ‌డం అదృష్టంగా భావిస్తున్నట్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Advertisement

Next Story