యంగ్ హీరోతో స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్

by Vinod kumar |
యంగ్ హీరోతో స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రంలో మాళవికా నాయర్‌ ఫిమేల్‌ లీడ్ రోల్‌ పోషించింది. నరేశ్‌, రాజేంద్రప్రసాద్‌, రావురమేశ్‌, గౌతమి, షావుకారు జానకి, వెన్నెల కిశోర్‌, అర్జుణ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. నందినీ రెడ్డి డైరెక్షన్ చేసిన మూవీ మే 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా నిహారికతో కలిసి సంతోష్ శోభన్‌ చిందులేశాడు. ‘మెరిసే మెరిసే’ పాటకు ఇద్దరూ కలిసి డాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed