Niharika konidela : కుటుంబానికి దూరంగా వెళ్లిపోతున్న నిహారిక.. కారణం అదేనా?

by Prasanna |   ( Updated:2023-09-03 06:06:48.0  )
Niharika konidela : కుటుంబానికి దూరంగా వెళ్లిపోతున్న నిహారిక.. కారణం అదేనా?
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక ఇండస్ట్రీలో అడుగుపెట్టి యాంకర్, హీరోయిన్‌గా అలరించినప్పటికి అనుకున్నంతగా గుర్తింపు మాత్రం పొందలేదు. ఇక మూవీస్ విషయం పక్కనపెడితే నిహారిక ఎక్కువగా తన వ్యక్తిగత విషయాల వల్ల తరచు వార్తలో నిలుస్తుంది. ముఖ్యంగా భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత అందరి ఫోకస్ నిహారికపైనే ఉంది. కానీ నిహారిక మాత్రం అవేవి పట్టించుకోకుండా తన కెరీర్‌ను చూసుకుంటుంది. ఇకపోతే నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచు ఆమెకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే నటి తాజాగా మెగా కుటుంబానికి దూరంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ మేరకు స్నేహితులంతా కూడా తనకు సెండాఫ్ ఇస్తూ ఎయిర్ పోర్టులో డ్రాప్ చేసినటువంటి వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అయితే ఇలా ఉన్నఫలంగా నిహారిక మెగా కుటుంబం నుంచి దూరంగా విదేశాలకు వెళ్లిపోవడానికి గల కారణం ఏమిటనే సందేహాలు మొదలయ్యాయి. అందులోను త్వరలోనే తన అన్నయ్య పెళ్లి పెట్టుకుని నిహారిక ఇలా సడన్‌గా వెళ్లిపోవడానికి కారణం ఏమిటని, లోపల ఇంకేమైనా గొడవలు జరిగాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Read More : Sreeja Konidela : త్వరలో శుభవార్త చెబుతానంటూ మెగాస్టార్ చిన్న కూతురు కీలక ప్రకటన.. పోస్ట్ వైరల్

Advertisement

Next Story

Most Viewed