- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
థ్రిల్లర్ చిత్రం ‘అకిడో’తో OTT ఎంట్రీ ఇస్తున్న నిధి అగర్వాల్..
దిశ, సినిమా: నిధి అగర్వాల్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సినిమాలతో మంచి పాపులరిటీ దక్కించుకుంది. దీంతో పాటు తమిళ్ లో ఎంట్రీ ఇచ్చి వరుసగా రెండు హిట్లు అందుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు తొలిసారిగా బాలీవుడ్ నుంచి ‘అకిడో’తో OTT ఎంట్రీ ఇవ్వబోతోంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ ప్రాజెక్ట్ విశేషాలు పంచుకుంది.
‘థ్రిల్లోంగ్ సినిమాలను రూపొందించడంలో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న నిర్మాత ప్రేరణా అరోరా. ఆయనతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. కథలో మంచి డెప్త్ కూడా ఉంది. అందుకని కాదనలేకపోయాను. నేను ఎక్కువగా ఇష్టపడే సినిమాలు ఇలాంటివే. అందుకే ఈ చిత్రం కోసం నన్ను సెలక్ట్ చేసినప్పుడు వెంటనే ఓకే చెప్పాను. డేట్స్ కూడా సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతం నేను టాలీవుడ్‌లోని ఇద్దరు పెద్ద స్టార్స్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ తో సినిమాలు చేస్తున్నాను. తెలుగుతో పాటు కోలీవుడ్ ప్రాజెక్టులు కూడా కమిట్ అయ్యాను. కాగా ‘అకిడో’ షూటింగ్ ఈ డిసెంబర్ ఎండ్ లో ప్రారంభం కానుంది’ అంటూ చెప్పుకొచ్చింది బ్యూటీ.
Read More..
‘పుష్ప -2’ కోసం అల్లు అర్జున్ ఇంతగా కష్టపడుతున్నాడా.. నిజంగా హాట్సాఫ్..!
- Tags
- Nidhhi Agerwal