ఇక నేనుండి ఎందుకు?.. ‘Jawan’ డైరెక్టర్‌తో గొడవపడ్డ Nayanatara

by Nagaya |   ( Updated:2023-08-22 15:20:27.0  )
ఇక నేనుండి ఎందుకు?.. ‘Jawan’ డైరెక్టర్‌తో గొడవపడ్డ Nayanatara
X

దిశ, సినిమా : ‘జవాన్’ సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఇన్నాళ్లు ట్వీట్ చేసిన క్రిటిక్ ఉమైర్ సంధు.. హీరోయిన్ నయనతార సినిమా అవుట్‌పుట్‌తో హ్యాపీగా లేదని రాసుకొచ్చాడు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న ఆమె.. దీనిపైనే ఆశలు పెట్టుకుంది. కానీ ఎడిటర్ తనతో చేసిన సీన్స్ ఆల్మోస్ట్ తొలగించాడని.. షారుఖ్‌ ఖాన్‌నే హైలెట్ చేశాడని కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ అట్లీతో గొడవపడినట్లు సమాచారం. మొత్తానికి మూవీ ఫైనల్ కాపీతో అంతగా సంతృప్తి చెందలేదు నయన్. అయితే సినిమా మాత్రం సెన్సార్‌కు రెడీ అయిపోయిందని తెలుస్తోంది.

Advertisement

Next Story