- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాలెంటైన్స్ సందర్భంగా మిస్ అవుతున్నానని పోస్ట్ పెట్టిన రష్మిక.. ఎవరికోసమో తెలుసా?
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక గురించి సుపరిచితమే. ఛలో, గీత గోవిందం, డియర్ కామ్రేడ్, గుడ్ బై, వారిసు, పుష్ప వంటి సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ముఖ్యంగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ రీసెంట్ గా తెరకెక్కిన యానిమల్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే చెరగని ముద్ర వేసుకుంది. ఇక ఈ అమ్మడుకు సినీ పరిశ్రమలో తిరుగుండదు. అంతటి విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.
రష్మిక ప్రస్తుతం పుష్ప - 2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉంది. మరోవైపు విక్కీ కౌశల్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పీరియాడిక్ మూవీ చావ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. తమిళంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ కు జంటగా ఓ చిత్రంలో చేస్తుంది. అంతేకాకుండా రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ అనే రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ నటిస్తూ తన సత్తా ఏంటో నిరూపించుకుంటుంది. సినిమాల విషయం పక్కన పెడితే..
తాజాగా రష్మిక మందన్న ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది. ‘‘మీతో మాట్లాడి చాలా డేస్ అవుతుంది గాయిస్. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. ఈరోజు అన్ని మాట్లాడేసుకుందాం.. ఇప్పటివరకు జరిగిన ప్రతి విషయం నేను మీ నుంచి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అలాగే మీ వాలెంటైన్స్ డే ప్లాన్స్ కూడా తెలుసుకోవాలని భావిస్తున్నాను. అంటూ నేషనల్ క్రష్ రష్మిక రెండు క్యూట్ సెల్ఫీలు పంచుకుంటూ కింద క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వగా.. ఎవరికోసం ఈ పోస్ట్.. విజయ్ దేవరకొండ కోసమా? అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.