విడుదలైన రెండోరోజే వివాదంలో నాని దసరా మూవీ!(వీడియో)

by GSrikanth |   ( Updated:2023-12-15 16:37:57.0  )
విడుదలైన రెండోరోజే వివాదంలో నాని దసరా మూవీ!(వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని ఓ సన్నివేశంపై అభ్యంతరకరంగా ఉందని ఆ సన్నివేశాన్ని వెంటనే తొలగించాలని తాజాగా తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. ఐసీడీఎస్‌లో అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సేవలను గుర్తించకుండా ఈ సినిమాలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేసే హీరోయిన్ దొంగతనం చేసే వ్యక్తిగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూవీలో అంగన్వాడీ టీచర్లను దొంగలుగా చూపించడం దుర్మార్గమైన చర్య అని, ఇది చిరు ఉద్యోగులపై దాడి చేయడం తప్ప మరొకటి కాదని మండిపడుతున్నారు. వెంటనే ఈ సీన్లను తొలగించాలని సెన్సాన్ బోర్డును యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని యూనియన్ నేతలు హెచ్చరించారు.


Advertisement

Next Story