- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భయంకరమైన వ్యాధి వేధిస్తున్నా ఆ కష్టాలు తప్పలేదు.. నిద్రలేని రాత్రులు గడిపా: Nandita Swetha
దిశ, సినిమా: కన్నడ బ్యూటీ నందిత శ్వేత ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. ఆమె నటించిన ‘హిడింబ’ జూలై 20న విడుదల కానుండగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నటి.. సినిమా విశేషాలతో పాటు తన హెల్త్ ఇష్యూస్ గురించి ఓపెన్ అయింది. ‘ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అందరినీ అలరిస్తుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మెప్పిస్తానని నమ్ముతున్నా. అయితే ఈ క్యారెక్టర్ కోసం బరువు తగ్గాల్సి వచ్చింది. దీనికోసం చాలా కష్టపడ్డాను. ఇప్పటికే ఫైబ్రోమైయాల్జియా అనే కండరాల రుగ్మతతో బాధపడుతున్నా. దానివల్ల ఎక్కువ డైట్ పాటించాను. భారీ వ్యాయామాలు చేయలేకపోయినా మూవీ కోసం చేయాల్సి వచ్చింది. నిద్ర లేకుండా పని చేశా. ఒత్తిడి వల్ల ఈ సమస్య మరింత ఎక్కువైంది. అయినా అన్నింటినీ భరించి ఎంతో కష్టపడ్డాను. దానికి తగిన ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నా’ అంటూ ఎమోషనల్ అయింది. ఇక ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా అనిల్ సినిమాను తెరకెక్కించాడు.
Also Read: ఆ పని చేస్తూ అడ్డంగా బుక్ అయిన భర్త.. మోసం చేశాడంటూ Sunny Leone పోస్ట్..