- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
హౌస్‌లో ఉన్న శేఖర్ బాషాకు గుడ్‌న్యూస్ చెప్పిన నాగార్జున.. భార్య డెలివరైంది.. ఎవరు పుట్టారంటే?
దిశ, వెబ్‌డెస్క్: రేడీయో జాకీ, టీవీ యాంకర్ జనాల్లో మంచి గుర్తింపు పొందాడు శేఖర్ బాషా. ప్రస్తుతం ఈయన నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తనదైన స్టైల్‌లో గేమ్ ఆడుతూ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాడు. అంతేకాకుండా శేఖర్ పంచులతో, జోకులతో హౌస్‌లోని కంటెస్టెంట్లతో పాటు జనాల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.
ఫస్ట్ వీక్‌లో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. కాగా సెకండ్ వీక్‌లో శేఖర్ బాషా పేరే గట్టిగా వినిపిస్తుంది. రెండో వారం నామినేషన్‌లో నాగమణికంఠ, నైనిక, విష్ణుప్రియ, నిఖిల్, ఆదిత్య, పృథ్వీ శెట్టి, శేఖర్ బాషా ఉన్నారు. కాగా ఈ వారం హౌస్ వీడి ఇంటికెళ్లేదెవరో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
అయితే తాజాగా శేఖర్ బాషాకు నాగార్జున ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. అయితే శేఖర్ భార్య 9 నెలల ప్రెగ్రెన్సీ అని హౌస్‌లోకెళ్లేముందు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. బాషా వైఫ్ గర్భవతి అని తెలిసింది. తాజాగా శేఖర్ భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నాగార్జున షో లో శేఖర్‌కు చెబుతాడు. దీంతో బాషా ఒక్కసారిగా ఎమోషనల్ అవుతాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.