- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
నాగ చైతన్య ‘దూత’ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
![నాగ చైతన్య ‘దూత’ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్ నాగ చైతన్య ‘దూత’ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్](https://www.dishadaily.com/h-upload/2023/11/15/281125-dootha.webp)
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రజంట్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుస ఫ్లాప్స్‌తో చతికిలపడిపోయిన చై వెనకడుగు వేయకుండా వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా తన ఓటీటీ డెబ్యూని కూడా ప్లాన్ చేసుకున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘దూత’ అనే వేబ్ సిరీస్‌తో రాబోతున్నాడు. ఇక తాజాగా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో తమ సోషల్ మీడియా అకౌంట్‌లో వెల్లడించింది.
‘మిస్టరీయా లేక మెసేజా? త్వరలోనే మీరు తెలుసుకుంటారు’ అనే క్యాప్షన్‌తో పాన్ ఇండియా భాషల్లో ఈ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అందుబాటులో ఉంటుందని తెలిపింది. అలాగా ఓ ఆసక్తికర పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇక ఈ సిరీస్ కోసం ఎప్పుటి నుంచో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు చై. కాగా పార్వతీ తిరువొత్తు, ప్రియా భవానీ శంకర్ లాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ నటిస్తున్న సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయని.. ముందుగా విక్రమ్ కుమార్ డైరెక్షన్‌పై పూర్తి నమ్మకం ఉందని కామెంట్ చేస్తున్నారు అభిమానుల.
mystery or message? you’ll find out soon enough 👀#DhoothaOnPrime, Dec 1 pic.twitter.com/7vNbKk6Aih
— prime video IN (@PrimeVideoIN) November 15, 2023