మెగా స్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన నాగబాబు!

by Anjali |   ( Updated:2023-06-16 16:07:22.0  )
మెగా స్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన నాగబాబు!
X

దిశ, వెబ్‌డెస్క్: నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, రాజకీయ నాయకుడిగా మెగా బ్రదర్ నాగబాబుకు సినీ పరిశ్రమలో ఎంతో మంచి పేరు ఉంది. ఇక తన అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే ఎంతగా ఇష్టపడాతాడో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే టాలీవుడ్‌లో అతడు పెద్ద స్టార్ కాకపోయినా మెగా ఫ్యాన్స్ నాగబాబును గౌరవిస్తారు. అయితే నాగబాబు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘ఒకసారి నాకు తీవ్రమైన అస్వస్థత కారణంగా చిన్నచిన్న చెడు అలవాట్లు వచ్చాయి. చిన్నప్పటి నుంచి నాకు జంతువులను చంపి తినటం అనేది అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నాన్ వెజ్ తినాల్సి వచ్చింది. ఇక ఆపేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ కుదరటం లేదు.’’ అంటూ తెలిపారు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ మీరు ముగ్గురు కలిసి కూర్చుని ఎప్పుడైనా మందు కొట్టారా? అని అడగ్గా.. నాగబాబు ‘ఛీ ఛీ అలాంటిది ఏమీ లేదు. ఎప్పుడూ కలిసి మందు కొట్టలేదు కానీ, భోజనాలు మాత్రం ఇప్పటికీ కలిసే చేస్తాం. ‘‘అన్నయ్య సినిమాల్లో పచ్చి తాగుబోతులా బీహెవ్ చేస్తాడు తప్ప బయట ఎక్కువగా మందు తాగడు. ఎప్పుడో ఫంక్షన్స్‌కు వెళ్ళినప్పుడు మాత్రమే లైట్‌గా తీసుకుంటాడు. తమ్ముడు కూడా అంతే. ప్రస్తుతం ఈ మెగా బ్రదర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి:

పెళ్లి కాకముందే వరుణ్ తేజ్.. లావణ్యకు చుక్కలు చూపిస్తున్నాడుగా?

బాలకృష్ణకు బాలయ్య అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Advertisement

Next Story