Murari Movie Effect: ఇదెక్కడి మాస్ రా మామా.. థియేటర్‌లో పెళ్లి చేసుకున్న సూపర్‌స్టార్ అభిమాని

by Anjali |
Murari Movie Effect: ఇదెక్కడి మాస్ రా మామా.. థియేటర్‌లో పెళ్లి చేసుకున్న సూపర్‌స్టార్ అభిమాని
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మురారి’ చిత్రం అప్పట్లో ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సోనాలి బింద్రే కథానాయికగా నటించింది. అందం, అభినయం జోడించి, అమాయకంగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల కలల రాణిగా నిలిచిపోయింది. ఇందులో రఘుబాబు, గొల్లపూడి మారుతీరావు, లక్ష్మి, రవిబాబు, సత్యనారాయణ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించి తెలుగు ప్రజల్ని మెప్పించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

అయితే నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి ఫిల్మ్‌ను మరోసారి థియేటర్లలో విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ నేడు ఉదయం నుంచి థియేటర్ల బాట పట్టారు. కొన్ని థియేటర్లలో మహేష్ బాబు లేడీ ఫ్యాన్స్ మాస్ స్టెప్పులేస్తూ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో థియేటర్‌లో జరిగిన ఓ సంఘటన నెటిజన్లను షాక్ కు గురిచేస్తుంది. అయితే థియేటర్‌లోనే ఓ జంట వివాహం చేసుకున్నారు. వారు మహేష్ బాబు ఫ్యాన్స్ కావడం విశేషం. అంతేకాకుండా ఈ కపుల్ పై అక్కడున్న వారంతా అక్షింతలు కూడా చల్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా జనాలు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed