మంచు మనోజ్, విష్ణుల మధ్య గొడవలు.. క్లారిటీ ఇచ్చిన మోహన్ బాబు?

by samatah |   ( Updated:2023-03-31 15:26:06.0  )
మంచు మనోజ్, విష్ణుల మధ్య గొడవలు.. క్లారిటీ ఇచ్చిన మోహన్ బాబు?
X

దిశ, వెబ్‌డెస్క్ : గత కొన్ని రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు, మనోజ్ మధ్య ఆస్తిగొడవలు జరుగుతున్నాయంటూ చాలా వార్తకథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వీటిపై మంచు ఫ్యామిలీ నుంచి ఎవరూ స్పందించలేదు. ఇవన్నీ రూమర్సే అని కొట్టిపారేసే క్రమంలో మనోజ్ , విష్ణు ఇలా గొడవపెడతాడంటూ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, వారి మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నవి నిజమేనని నెటిజన్స్‌కు ఓ క్లారిటీ వచ్చింది.

కానీ చివరకు ఆ వీడియో ఫ్రాంక్ అంటూ మరికొన్ని వార్తలు వచ్చాయి. దీంతో ఏదీ నమ్మాలో తెలియక మంచు అభిమానులు కాస్త అయోమయంలో పడిపోయారు.

కాగా, తాజాగా మంచు బ్రదర్స్ మధ్య గొడవలపై హీరో మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలొ పాల్గొన్న ఆయన తన కుటుంబంలోని గొడవల గురించి మాట్లాడుతూ.. అన్నదమ్ముల మధ్య ఉన్నవి చిన్న చిన్న గొడవలే కానీ అవి చిలికి చిలికి గాలి వానలా మారినట్టు కనిపిస్తోంది. ప్రతి ఒక్కరికీ ఆవేశాలు, మనస్పదర్ధలు ఉంటాయి. కానీ ఈ గొడవల వలన ఎవరికైనా లాభం ఉందా అంటే ఎంవరికీ ఏం లాభం లేదు, మనుసు బాధపడి, మనుషులు దూరం అవడం తప్పితే. అంతే కాకుండా కుటుంబంలో ఉన్న ఆనందం కూడా దూరమైపోతుంది. ఇలా గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అని కాస్త ఫీల్ అవుతాను.అంతేకాదు అలాంటివి జరగకపోతే బాగుండు కదా అని కూడా అనుకుంటారు. అంటూ తమ కొడుకుల గొడవలపై మోహన్ బాబు పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు.

Also Read..

నాటు నాటు పాటతో ఐపీఎల్ ఫ్యాన్స్‌లో జోష్ నింపిన రష్మిక (వీడియో)

Advertisement

Next Story