నేను బై-సెక్సువల్.. అన్ని అందాలను ఆస్వాదిస్తా: మిస్ యూనివర్స్

by Hamsa |   ( Updated:2023-06-01 09:38:47.0  )
నేను బై-సెక్సువల్.. అన్ని అందాలను ఆస్వాదిస్తా: మిస్ యూనివర్స్
X

దిశ, సినిమా: 2023 ఫిలిప్పీన్స్ మిస్ యూనివర్స్ మిచెల్ మార్క్వెజ్ డీ.. తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. రీసెంట్‌గా ప్రముఖ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ తాను ద్విలింగ సంపర్కురాలినని వెల్లడించింది. ‘నేను అన్ని రకాల అందాలు, ఆకారాలు, పరిమాణాలకు ఆకర్షితురాలినయ్యాను. కాబట్టి నాలాంటి వాళ్లకోసం నా వాయిస్ బలంగా వినిపిస్తా. మనందరం సమాజంలోని మూస పద్ధతులను వ్యతిరేకిద్దాం. ఎలాంటి పక్షపాతాలు లేని సమాజాన్ని, కథలను ప్రోత్సహిద్దాం. అందరినీ సొంతం వ్యక్తులుగా భావించేలా ప్రేరేపించి, తిరుగులేని శక్తిగా మారడానికి స్ఫూర్తినింపుకుందాం’ అంటూ అన్ని రకాల జెండర్లతో ఆదర్శంగా వ్యవహరించాలని కోరింది.

Read More: ఈ రోజుల్లో వాటికి సరిహద్దులు లేవు.. అందరితో అల్లుకుపోవాలి

Click Here for Instagram Link

Advertisement

Next Story