- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనసేనకు మద్దతుపై మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్..
దిశ, వెబ్‌డెస్క్: జనసేనకు మద్దతు ఇవ్వడంపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి మద్దతు ఇస్తానో లేదో భవిష్యత్తే నిర్ణయిస్తుందని అన్నారు. నా తమ్ముడు పవన్ కల్యాణ్ నిబద్ధత, నిజాయితీ నాకు తెలుసని.. పవన్ భవిష్యత్‌లో రాష్ట్రాన్ని ఏలే నాయకుడు కావచ్చని చెప్పారు. పవన్ కల్యాణ్ లాంటి నిబద్ధత ఉన్న నాయకుడు మనకు రావాలని.. నా ఆకాంక్ష కూడా అదే అని.. దానికి నా మద్దతు ఉంటుందని మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మేం రాజకీయాల్లో చైరో వైపు ఉండకూడదనే.. నేను రాజకీయాల నుండి వైదొలిగానని కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో తాను ఏ పక్షాన ఉంటానో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు.
గాడ్ ఫాదర్ మూవీలో కథ ఆధారంగానే డైలాగ్స్ రాశారని.. తాను ప్రస్తుత రాజకీయాలపై సైటెర్లు వేయలేదని.. దానికి ఎవరైనా భుజాలు తుడుముకుంటే నేను ఏమి చేయలేనని స్పష్టం చేశారు. నేను రాజకీయాల నుండి వైదొలిగి సైలెంట్‌గా ఉన్నానని.. భవిష్యత్‌లో పవన్‌కు మద్దతు ఇస్తానేమో కాలమే నిర్ణయిస్తుందన్నారు. పవన్ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారని.. అతడు మంచి స్థాయి రావాలని ఆశిస్తు్న్నానని అన్నారు.